
ఉక్కుపాదం మోపుతాం
ఆర్‌ఎంపీలు, పీఎంపీలే యాంటీబయోటిక్ మందులు, మాత్రలు, సరఫరా చేస్తున్నారు. వీళ్లే చికిత్సలు చేస్తున్నారు. జాయింట్‌లకు కూడా సూదులు వేస్తున్నారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అనధికారిక క్లినిక్‌లపై తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు వందకు పైగా క్లినిక్‌లను తనిఖీ చేస్తే 43 దాకా సీజ్ చేశాం. వాటి వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతున్నాం. వారి ఆదేశాలతో తదుపరి చర్యలు ఉంటాయి. నకిలీ వైద్యంపై ఉక్కుపాదం మోపుతాం. వదలిపెట్టే ప్రసక్తే లేదు.
– డాక్టర్ సుధారాణి,
డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు