
ప్రమాణాలు పెంచేందుకు సంస్కరణలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీవారి సేవకులకు సంబంధించి గ్రూప్ సూపర్‌వైజర్లు, ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్‌పై ఈఓ శ్యామ ల రావు శుక్రవారం తిరుపతిలో ని టీటీడీ పరిపాలనా భవనంలో ఏపీ ప్లానింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు, జేఈఓ వీరబ్రహ్మంలతో, వర్చువల్‌గా ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన ప్రొఫెసర్లు విశ్వనాథ్, రామమోహన్, అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి సేవా ప్రమాణాలను మరింత పెంపొందించాలనే దిశ గా పలు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపారు. సీపీఆర్‌ఓ టి.రవి, డీఎఫ్‌ఓ జీఎం (ఐటీ ఇన్‌చార్జ్) ఫణికుమార్ నాయుడు, శ్వేత డైరెక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు.