
మహిళా వర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ పురస్కారాలు
తిరుపతి రూరల్ : తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన అయిదుగురు అధ్యాపకులు ఉత్తమ బోధకుల పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రొఫెసర్ వెంకటకృష్ణ (ఎంసీఏ), ప్రొఫెసర్ వై.ఎస్. శారద (ఇంగ్లీష్), ప్రొఫెసర్ జోత్సన (జీవ సాంకేతికశాస్త్రం), ప్రొఫెసర్ అరుణ (హోమ్ సైన్స్), ప్రొఫెసర్ రమ్య కుబేర్ (ఫార్మసీ) ఆ గౌరవాన్ని అందుకోనున్నారు. ఆ పురస్కారాన్ని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా అందుకోనున్నారు. వీరి విజయం బోధన, పరిశోధన, విద్యార్థుల మార్గదర్శనంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపు లభించినట్టు వీసీ ఆచార్య ఉమ అభినందించారు.
సుబ్రహ్మణ్యంకు ఉత్తమ పురస్కారం
చంద్రగిరి : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలోని అగ్రోనమీ విభాగం ప్రొఫెసర్ డా.డి.సుబ్రహ్మణ్యానికి ఉత్తమ అధ్యాపకుల పురస్కారం లభించింది. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలలో ఆయన చేసిన కృషికి గాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, యూనివర్శిటీ అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

మహిళా వర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ పురస్కారాలు

మహిళా వర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ పురస్కారాలు

మహిళా వర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ పురస్కారాలు

మహిళా వర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ పురస్కారాలు