
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
రేణిగుంట : మూడు జిల్లాల్లో పదేళ్లుగా బైక్ దొంగతనాలు చేస్తూ 63 కేసుల్లో నిందితుడిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన దొడ్డ సంతోష్‌ను రేణిగుంట అర్బన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లు రేణిగుంట, చంద్రగిరి, అలిపిరి, తిరుచానూరు, భాకరాపేట, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించినవిగా తెలిపారు. ఎక్కువగా బైక్ దొంగతనం కేసులు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయని అన్నారు. అంతర్ జిల్లా దొంగను సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసిన అర్బన్ పోలీసులను అభినందించారు. దొంగను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డును అందించారు. సమావేశంలో ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు నాగరాజు, సుధాకర్, ట్రైనీ ఎస్‌ఐ స్వాతి, రాజశేఖర్, బారుషా, గౌరీ నాయుడు, శీను పాల్గొన్నారు.