అయ్యోర్ల అయోమయం ! | - | Sakshi
Sakshi News home page

అయ్యోర్ల అయోమయం !

Sep 4 2025 5:43 AM | Updated on Sep 4 2025 5:43 AM

అయ్యో

అయ్యోర్ల అయోమయం !

అర్హులకు అవార్డులు వరించేనా?

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలపై సందిగ్ధం

ఎవరికి వరిస్తుందో తెలియని గందరగోళం

పార్టీ అనుచరులనే ఎంపిక చేయనున్నట్లు ఆరోపణలు

ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు

రేపు ఉపాధ్యాయ దినోత్సవం

తిరుపతి సిటీ : గురువు అనే పదానికి అర్థమిచ్చేలా జిల్లా అధికారులు ప్రవర్తించాలి అంటూ తిరుపతి జిల్లాలోని ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. రాజకీయ, కుల, సామాజిక వర్గాలకు అతీతంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత విద్యను విద్యార్థులకు అందించే నేపథ్యంలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఏటా సెప్టెంబర్‌ 5న సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ జన్మదినం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక రాజకీయ, కుల సమీకరణాలతో ముడిపడుతున్నట్లు ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి ఇన్‌చార్జి మంత్రి, స్థానిక నాయకుల పర్యవేక్షణలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూరైనట్లు సమాచారం.

అర్హులకు మొండిచెయ్యేనా !

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ఈ ఏడాదైనా సక్రమంగా జరిగేనా అంటూ ఎదురు చూసిన గురువులకు నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల కోసం జిల్లా నుంచి సుమారు 49 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 8 మందిని మాత్రమే జిల్లా విద్యాశాఖ రెఫర్‌ చేసింది. ఇందులో అధికార పార్టీ అనుచరులైన అదే సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలాగే గతేడాది సుమారు 75 మందిని ఎంపిక చేసిన జిల్లా విద్యాశాఖాధికారులు అందులో అధికారిక పార్టీకి చెందిన వారే సుమారు 80శాతం ఉన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం సుమారు 120 మంది దరఖాస్తు చేసుకోగా అందులో సామాజిక సమీకరణాలు, రాజకీయ నాయకులు ఒత్తిడితోనే పూర్తి స్థాయి ఎంపికలు జరిగినట్లు సమాచారం.

దరఖాస్తు చేసుకోనివారు వెయ్యి మందిపైనే...

జిల్లాలో కుల ప్రాతిపదికన, అధికార పార్టీకి అనుచరులుగా గుర్తింపు పొందిన వారిని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారని, అందుకే తాము కనీసం దరఖాస్తు చేసుకోలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటపడి స్వరం వినిపిస్తే దారుణంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతారనే భయంతో తాము చెప్పుకోవడలేదని వాపోతున్నారు. దీంతో సుమారు అర్హులైన వెయ్యి మంది ఉపాధ్యాయలు ఉత్తమ అవార్డులకు దరఖాస్తు చేసుకోలేక మధనపడుతున్నారు.

ఉత్తమ అవార్డులలోనూ రాజకీయమా ?

విద్యార్థుల ఔన్నత్యానికి పాటుపడిన ఉపాధ్యాయులను విస్మరించి, రాజకీయ రంగు పులుముకున్న వారికి అవార్డులు ఇస్తూ గురువు అనే పదానికే అర్థం మార్చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 75 మందికి పైగా ఉత్తములంటూ అవార్డులు ప్రభుత్వ ప్రకటించడం దారుణం. ఇందులో కనీసం 56 మంది రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో ఉత్తములుగా అవార్డులు పొందారు. ఇంత దారుణంగా గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ ఏడాదైనా అర్హులను గుర్తించి ప్రభుత్వం ఉత్తములుగా అవార్డులు అందిస్తుందని ఆశిస్తున్నాం.

– ఉపాధ్యాయ సంఘాలు, తిరుపతి జిల్లా

పారదర్శకంగానే ఉత్తమల ఎంపిక

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. జిల్లాలో అర్హులైన ప్రతి ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని కోరాం. ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసి ఉత్తమ అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వానికి పంపాం. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.

– కేవీఎన్‌ కుమార్‌, డీఈఓ, తిరుపతి జిల్లా

అయ్యోర్ల అయోమయం !1
1/1

అయ్యోర్ల అయోమయం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement