
ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల అరెస్టు
గూడూరు రూరల్ : పొలాల వద్ద ఉండే ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి రాగి వైర్లను చోరీ చేసే ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 135 కిలోల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ కిషోర్‌బాబు తెలిపారు. గూడూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఓజిలి మండలం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన చిన్నబ్బయ్య, పోలయ్య గూడూరు రూరల్, బాలాయపల్లి, డక్కిలి, చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 24 ట్రాన్‌ఫార్మర్లను పగులగొట్టి రాగి తీగలను దొంగిలించారు. ఈ మేరకు గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 65 కేజీల రాగి తీగలు, బాలాయపల్లిలో 70 కిలోల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను ఛేదించడంలో రూరల్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణయ్య, శ్రీనివాసరావును అభినందించారు.