ఏర్పేడు:‘ఇన్నాళ్లూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సైన్స్ ల్యాబ్‌ల్లో మెదడుకు పదును పెట్టి ఎన్నో ప్రయోగాలు చేశారు.. భావి శాస్త్రవేత్తలుగా బ యటకు వెళుతున్న మీరంతా దేశ సౌభాగ్యం కోసం కలలు కనాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై పరిశోధనలు చేసి, పరిష్కారాలను కనుగొనాలి.’ అని గోదావరి బయో రిఫైనరీస్ చైర్మన్ సమీర్ సోమ య్య పిలుపునిచ్చారు. ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్) ఆరో స్నాతకోత్సవం డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఐసర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకను ఐసర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ఝిల్లుసింగ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 255 మంది విద్యార్థులను పట్టాలతో సత్కరించారు. పట్టాలు అందుకున్న వారిలో 22 మంది పీహెచ్‌డీ విద్యార్థులు, 8 మంది ఐపీహెచ్‌డీ విద్యా ర్థులు, ముగ్గురు ఎంఎస్ విద్యార్థులు, 141 మంది బీఎస్–ఎంఎస్ విద్యార్థులు, 69 మంది ప్రొఫెషనల్ మా స్టర్స్ విద్యార్థులు, ఆరుగురు బీఎస్ విద్యార్థులు, మరో ఆరుగురు బీఎస్సీ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులున్నారు. ముఖ్యఅతిథి గోదావరి బయోరిఫైనరీస్ లిమి టెడ్ చైర్మన్ సమీర్ సోమయ్య మాట్లాడుతూ భారతీ య వారసత్వం, శాస్త్రానికి సంబంధించి ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మట్టి ఆధారిత వ్యవస్థ వైపు మారాలన్నారు. వ్యవసాయ రంగంతో కలిసి యువ శాస్త్రవేత్త లు పని చేయాలన్నారు. ప్రతి వ్యక్తి తొలుత తల్లి నుంచే బోలెడంత విజ్ఞానాన్ని నేర్చుకుంటారని, వినడం, వివేచన, సాధన ద్వారానే సృజనాత్మకత పెంపొందుతుందన్నారు. మానవ జీవన విజ్ఞానంతోపాటు ప్రపంచంలోని అనేక జీవరాశులపై పరిశోధనలు చేయాలన్నారు. కాపీ ధోరణికి స్వస్తి పలికి, సొంత పరిజ్ఞానంతో పరిశోధనలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రకృతిని పరిరక్షించేలా పరిశోధనలు సాగాల ని కోరారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ఝిల్లుసింగ్ యాదవ్ మాట్లాడుతూ కర్బన ఉద్గారాల్లో గ్రీన్ కర్బనాలపై మరిన్ని పరిశోధనలు చేయాలని కోరారు. పలు రంగాల్లో ఎన్నో సవాళ్లు ప్రపంచ వైజ్ఞానిక విధానానికి పెనుసవాళ్లుగా కనిపిస్తున్నాయని, వాటి పరిష్కారాల ను వెతికే రీతిలో పరిశోధనలు సాగాలన్నారు.
శాసీ్త్రయ ప్రతిభ
2024–25లో 210 పరిశోధనా పత్రాలు ప్రచురించబడ్డాయన్నారు. రూ. 29.43 కోట్ల బహిరంగ పరిశోధన నిధులను పొందారని శాంతనుభట్టాచార్య వెల్లడించారు. నేచర్ ఇండెక్స్–2025 ప్రకారం తిరుపతి ఐసర్ దేశంలోనే 33వ స్థానంలో నిలిచిందన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ప్రపంచ ఉత్తమ రెండు శాతం శాస్త్రవేత్తల జాబితాలో ఎని మిది మంది ఐసర్ ఫ్యాకల్టీ సభ్యులు చోటుదక్కించుకోవడం తమకెంతో గర్వకారణమన్నారు. కోవిడ్ సమయంలో ఉచిత పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించామన్నారు. కార్యక్రమంలో ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్‌సింగ్ కోహ్లీ, లెఫ్ట్ కమాండర్ హిమాంశు శేఖర్, సీఎంఏ రమేష్ దామర్ల, వెంకటదీపక్, భానుశ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న
సవాళ్లపై పరిశోధనలు చేయండి
ఐసర్ ఆరో స్నాతకోత్సవంలో
పట్టభద్రులకు ముఖ్యఅతిథి పిలుపు
అట్టహాసంగా స్నాతకోత్సవ వేడుకలు
255 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం
ఆవిష్కరణకు పునాదిగా ఐసర్
సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య మాట్లాడుతూ పరిశోధన, వైజ్ఞానిక ఆవిష్కరణలకు పునాది వేసేలా తిరుపతి ఐజర్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రత్యేక శిల్పకళతో తీర్చిదిద్దిన ఐసర్ గ్రిహ కౌన్సిల్, టెరీ 4 స్టార్ రేటింగ్ ఇచ్చాయన్నారు. గ్రంథాలయం, ఆడిటోరియం వంటి భవనాల్లో భారతీయ, విదేశీ ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు చెక్కి ఉండటం విశేషమన్నారు.
దేశ సౌభాగ్యానికి కలలు కనండి
దేశ సౌభాగ్యానికి కలలు కనండి
దేశ సౌభాగ్యానికి కలలు కనండి
దేశ సౌభాగ్యానికి కలలు కనండి