
ఐసర్ విద్యా ప్రయాణం.. తీపి జ్ఞాపకం
‘వారంతా అత్యున్నత ప్రతిభావంతులు.. జాతీయస్థాయి ప్రఖ్యాత సైన్స్ విద్యాసంస్థ తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్)లో సీటు సాధించి ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఈ క్రమంలో తరగతి గదుల్లో పుస్తకాలతో దోస్తీ కట్టి మేథోమదనం చేశారు. సైన్స్ ల్యాబ్‌ల్లో నూతన ప్రయోగాలకు గట్టి బీజం వేశారు. తోటి విద్యార్థులతో చెలిమి చేసి గట్టి బంధాన్ని పదిలం చేసుకున్నారు..దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఐసర్ వేదికగా ఉన్నత చదువులు పూర్తి చేసుకుని, భావి శాస్త్రవేత్తలుగా దేశం గర్వించే పౌరులుగా తయారు కావడానికి సిద్ధమై డిగ్రీ పట్టాలను కన్న తల్లిదండ్రుల కళ్లెదుట ఆచార్యుల నుంచి అందుకుని... ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఆచార్చుల సూచనలతో స్ఫూర్తి నింపుకున్నారు. పట్టా చేతికొచ్చిన తరుణంలో సంతోష సాగరంలో మునిగారు. ఒళ్లు మరచి.. స్నేహితులతో కలసి స్టేజ్ పైకెక్కి హుషారైన సినీ గీతాలకు ఫుల్ జోష్‌తో నృత్యాలు చేశారు. ఐజర్ ప్రాంగణమంతా కలియతిరుగుతూ చివరి సెల్ఫీలు దిగుతూ ఆద్యంతం పట్టాభిషేకాన్ని ఆస్వాదిస్తూ స్నాతకోత్సవ శోభను ద్విగుణీకృతం చేశారు.

ఐసర్ విద్యా ప్రయాణం.. తీపి జ్ఞాపకం

ఐసర్ విద్యా ప్రయాణం.. తీపి జ్ఞాపకం