
ప్రత్యేక పరిషత్తులతో సంపూర్ణ జ్ఞానం
సంపూర్ణ జ్ఞానం అందించడానికే సంస్కృత వర్సిటీలో ప్రత్యేక పరిషత్తులు ఏర్పాటు చేసినట్లు వీసీ కృష్ణమూర్తి తెలిపారు.
– 10లో
స.హ. చట్టంపై అవగాహన అవసరం
తిరుపతి అర్బన్: సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన ఉండా ల్సిన అవసరం ఉందని ఉద్యానశాఖ జిల్లా అధి కారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తమ కార్యాలయంలో సోమవారం మండల ఉద్యానశాఖ అధికారులతో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పరిపాలనకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రకారం, ప్రతి భారత పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే హక్కు ఉందన్నారు. జిల్లాసూక్ష్మ నీటిపారుదల విభాగం జిల్లా అధికారి సతీష్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ విభాగం తమ వద్ద ఉన్న సమాచారాన్ని పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఆగస్టు 11 నుంచి బీఈడీ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 11 నుంచి 14వ తేదీ వరకు రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించి 30లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కోసం జ్ఞానభూమి పోర్టల్‌ను సందర్శించాలని సూచించారు.
– 10లో