ఏబీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా రాస్‌ వెంకటరత్నం | - | Sakshi
Sakshi News home page

ఏబీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా రాస్‌ వెంకటరత్నం

Jul 22 2025 6:22 AM | Updated on Jul 22 2025 9:11 AM

ఏబీఆర

ఏబీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా రాస్‌ వెంకటరత్నం

తిరుపతి కల్చరల్‌: స్వర్గీయ పద్మవిభూషణ్‌ డాక్టర్‌ నిర్మలాదేష్‌ పాండే స్థాపించిన అఖిల భారత రచనాత్మక సమాజ్‌(ఏబీఆర్‌ఎస్‌) జాతీయ అధ్యక్షుడిగా రా ష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.వెంకటరత్నం నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సేవాధామ్‌ ఆశ్రమంలో ఈనెల 20వ తేదీన ఏబీఆర్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎస్‌.వెంకటరత్నంను ఏబీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసి, ఆలిండియా హరిజన సేవక్‌ సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు శంకర్‌ కుమార్‌ సన్యాల్‌, బీహార్‌ మాజీ ఎంపీ నరేశ్‌ యాదవ్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ అందజేశారు. రాస్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సభ్యులు, జనరల్‌ బాడీ సభ్యులు, ఇతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

ఎస్వీయూ సైన్స్‌ కళాశాలకు ఎన్‌పీటీఈఎల్‌ ప్రశంసలు

తిరుపతి సిటీ: జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా వర్సిటీలో విద్యార్థులు స్వ యంగా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ పొందే కోర్సులను ‘స్వయం’ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కోర్సుల రూపకల్ప న, బోధనలో ఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్వీయూ పీజీ కోర్సుల్లో స్వయం కోర్సులను ప్రవేశపెట్టింది. 2025 జనవరి – ఏప్రిల్‌ సెమిస్టర్లలో వర్సిటీ సైన్స్‌ కళాశాల గణిత విభాగానికి చెందిన ఆచార్య భారతి కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తూ ఎన్‌పీటీఈఎల్‌ సంస్థ ప్రశంసా పత్రాలు పంపింది. ఈ సందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పద్మావతి ఆమెను అభినందించారు.

ఔట్‌ సోర్సింగ్‌ శానిటరీ సిబ్బందికి జీతాలు పెంపు

తిరుపతి తుడా: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ శానిటరీ సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు ఆయా మున్సిపల్‌ కార్యాలయాల సొంత నిధుల నుంచే ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వదని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. కేటగిరి–1 కింద పనిచేస్తున్న శానిటరీ వర్కర్లకు రూ.21,500 నుంచి రూ.3 వేలు పెంచుతూ రూ.24,500 వేతనం చెల్లించనున్నారు. అలాగే కేటగిరీ–2 వర్కర్లకు ప్రస్తుతం అందిస్తున్న రూ.18,500 నుంచి రూ.21,500 పెంచారు. కేటగిరీ–3 వర్కర్లకు రూ.15 వేల నుంచి రూ.18, 500 చెల్లించాలని నిర్ణయించారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో కింది కోర్టు తీర్పు అమలు

తిరుపతి లీగల్‌:చెక్‌ బౌన్స్‌ కేసు తీర్పుపై దాఖలు చేసిన అపీల్‌ను కొట్టి వేస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి సోమవారం తీర్పు చెప్పినట్టు ఫిర్యాది తరపు న్యాయవాది ముని భాస్కర్‌ తెలిపారు. తిరుపతి, పీకే లేఅవుట్‌కు చెందిన కే వెంకట్‌ రెడ్డి వద్ద తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, సీఆర్పీఎఫ్‌లో ఉమెన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉన్న పి విజయదుర్గ అలియాస్‌ జీవి దుర్గ భర్త 2012 అక్టోబర్‌ 25వ తేదీ రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో 2016 నవంబర్‌ నెలలో రూ.5.50 లక్షల విలువచేసే రెండు చెక్కులను ఆమె వెంకట్‌రెడ్డికి ఇచ్చారు. అతను ఆ రెండు చెక్కులను బ్యాంకులో వేయగా బౌన్స్‌ అయ్యాయి. దీనిపై అతను విజయదుర్గపై తిరుపతి ఆరో అదనపు ప్రత్యేక జూనియర్‌ జడ్జి కోర్టులో చెక్‌ బౌన్స్‌ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి మూడు నెలల్లోపు ఆమె రూ.15,60,000 అతనికి చెల్లించాలని, లేకుంటే ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు. ఆ తీర్పుపై ఆమె స్థానిక నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును అమలు చేయాలంటూ తీర్పులో పేర్కొన్నారు.

ఏబీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా రాస్‌ వెంకటరత్నం 1
1/1

ఏబీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా రాస్‌ వెంకటరత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement