
ఆకట్టుకున్న అభినయ ఆర్ట్స్ నాటకోత్సవాలు
తిరుపతి కల్చరల్: అభినయ ఆర్ట్స్ జాతీయ నాటక పోటీల్లో భాగంగా మహతి కళాక్షేత్రంలో సోమ వారం ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద నృత్యాలు, పౌరాణిక, సాంఘిక నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన శాసీ్త్రయ, జానపద బృంద నృత్య పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని, తమదైన శైలిలో చక్కటి హావభావాలు, అభినయంతో నృత్య ప్రదర్శనలతో సభికులను అలరింపజేశారు. ఈ సందర్భంగా కళాకారులను అభినయ ఆర్ట్ కార్యదర్శి బీఎన్.రెడ్డి, సంస్థ ప్రతినిధులతో కలిసి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఆకట్టుకున్న అభినయ ఆర్ట్స్ నాటకోత్సవాలు