ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ హేయమైన చర్య | - | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ హేయమైన చర్య

Jul 22 2025 6:22 AM | Updated on Jul 22 2025 9:11 AM

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ హేయమైన చర్య

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ హేయమైన చర్య

సూళ్లూరుపేట: ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్‌రెడ్డిని అరెస్ట్‌ హేయమైన చర్య అని, ఇది కూటమి ప్రభు త్వ కుట్రపూరిత, కక్షపూరిత రా జకీయంలో భాగమేనని సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కిలివేటివ సంజీవయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఆ యన సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘అక్రమ మద్యం కేసు అని.. దాని కి ఎలాంటి మూలాలు లేకుండా, సాక్ష్యాధారా లు లేకుండా బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్టుగా ఉంది. జగనన్నకు అండగా నిలిచిన వారి పేర్లును రెడ్‌బుక్‌లో రాసుకుని వారినే టా ర్గెట్‌ చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారు. సిట్‌ అధికారులు చంద్రబా బు, లోకేష్‌ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రైవేట్‌ ముసుగులో మోసం చేయలేదా?. బెల్టుషాపులు నిర్వహించి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదా..? దీనిపై ఆయనపై కేసు పెడితే ప్రస్తుతం ఆయన బెయిల్‌ మీదే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి’ అని అన్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ చేయలేదా?

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి అధికారంలో వచ్చాక రెడ్‌బుక్‌ పాలన చేస్తున్న పెద్ద బాబు, చిన్నబాబుకు ముందుంది ముసళ్ల పండుగ అని సంజీవయ్య అన్నారు. నేతలు జెట్టి వేణుయాదవ్‌, చిన్న సత్యనారాయణ, స్వామిరెడ్డి, బందిలి మహేష్‌ అయితా శ్రీధర్‌, వాకాటి బాబురెడ్డి, నందారెడ్డి, హుస్సేన్‌, జయకుమార్‌, పర్వతరెడ్డి రవిరెడ్డి, చిలకా యుగంధర్‌, సురేష్‌, బద్దెపూడి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement