
ప్రజలకు సేవ చేయడం నేరమా?
నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే పెద్దిరెడ్డి కుటుంబం చేసిన నేరమా..?. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇలా తప్పుడు కేసులు బనాయించే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. –మాగడి సల్మా, హ్యూమన్
రైట్స్ జిల్లా ఉపాధ్యక్షురాలు, పుంగనూరు
తిరుగుబాటు తప్పదు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అక్రమం. తప్పుడు కేసులు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణచి వేయలేరు. పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులు బనాయిస్తే తిరుగుబాటు ఉద్యమం తప్పదు.
– కిషోర్, వ్యాపారి, పుంగనూరు
బాధాకరం
పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ఆయనకున్న ప్రజాభిమానాన్ని చూసి సహించలేక పోతున్నారు. అందుకనే ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇది చాలా బాధాకరం. ప్రజా సేవ చేసే వారిని ఇలాంటి కేసులు ఏమీ చేయలేవు.
– ఆసిఫ్, మైనార్టీ యువకుడు
కేసులు కాదు...అభివృద్ధి చేయండి
పుంగనూరు నియోజకవర్గాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వానికి చేతనైతే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలే తప్ప.. ఇలా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్.
– యాసిన్, మైనార్టీ యువకుడు,
పుంగనూరు

ప్రజలకు సేవ చేయడం నేరమా?

ప్రజలకు సేవ చేయడం నేరమా?

ప్రజలకు సేవ చేయడం నేరమా?