
అనుమతి లేదంటూ అరెస్టు
పెళ్లకూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మామిడి సాగు రైతుల పరామర్శకు జిల్లాకు వచ్చిన సందర్భంగా హాజరయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి పుల్లూరు నుంచి వెళుతుండగా మార్గమధ్యలో రెడ్డిగుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడి రైతుల పరామర్శ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొనేందుకు అనుమతి లేదంటూ చిందేపల్లిని అరెస్టు చేసి ఆయన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిగరపల్లి బడిని కొనసాగించాలి
పాకాల : మండలంలోని చిగరపల్లి ఎంపీపీ పాఠశాలను గతంలో మాదిరిగానే కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో పాఠశాలను 5వ తరగతి వరకు కొనసాగించాలని, పాఠశాలను విలీనం చేయడంతో సుమారు 4 కిలో మీటర్లు నడిచి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి వరకు, గతంలో నిర్వంహించిన మాదిరిగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు మమత, ఝాన్సీ, గౌరి, మీన, జ్యోతి, పుష్ప, సుబ్రమణ్యం, శిరీష, శ్రీనివాసులు, గోపి, కుమార్, మంజునా థ్, విశ్వనాథ్, హేమలత, ధనమ్మ, ధనలక్ష్మి, చిట్టి పాల్గొన్నారు.

అనుమతి లేదంటూ అరెస్టు