
కలెక్టర్‌కు వినతుల వెల్లువ
తిరుపతి అర్బన్: గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం పలుప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అర్జీలు ఇవ్వడానికి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. మొత్తం 296 అర్జీలు రాగా, అందులో 145 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, పలువురు జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. ఈ క్రమంలో రశీదుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. అయితే వీఆర్‌ఏలు, అటెండర్లు అర్జీలను రాసి అందించారు. గ్రీవెన్స్‌లో ఉన్న కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులను సోమవారం కుంభమేళాకు వెళ్లి విచ్చేసిన నాగసాధువులు ఆశీర్వదించారు.
రజకుల స్థలానికి రక్షణ కల్పించండి
తిరుపతి రూరల్ మండలం పేరూర్ పంచాయతీ యాదవ్‌కాలనీలో నివాసం ఉంటున్న రజకులకు 2014లో 30 సెంట్లు, ఆ తర్వాత అదే ఏడాది మరో 20 సెంట్లు భూమి కేటాయించాని రజకులు వెల్లడించారు. అయితే ఆ స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ పంచాయతీ కార్యదర్శి తమదీ అంటూ కంచె ఏర్పాటు చేశారని చెప్పారు. దీన్ని పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. నాయుడుపేటలో మినా ట్రక్స్, వ్యాన్ డ్రైవర్లకు అంబేడ్కర్ భవనం సమీపంలోని ఆర్‌అండ్‌బీ స్థలంలో పార్కింగ్ చేసుకోవడానికి స్థలాన్ని గతంలో కేటాయించారని చెప్పారు. అయితే ఆస్థలాన్ని ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, వ్యాన్ డ్రైవర్లు ఓ.గిరి, మస్తాన్ రెడ్డి. సిహెచ్.హేమంత్, వి.రమణయ్య, అమీర్, చెంచు కృష్ణయ్య, జిలాని, సతీష్, మాధవ్, చంద్ర పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు 296 అర్జీలు
రెవెన్యూ సమస్యలపై 145 అర్జీలు
తప్పుడు నివేదికలు ఇస్తున్నారు
గత ఏడాది డిసెంబర్ వరకు 15,264 అర్జీలు గ్రీవెన్స్‌లో వస్తే అందులో 15,103 అర్జీలు పరిష్కారం అయినట్లు కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. ఆయన కలెక్టరేట్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్జీల్లో 98.94శాతం పరిష్కారం చేసినట్లు లెక్కలు చూపడం దారుణంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువులో చెరువు ఆక్రమణలు తొలగించాలని గతంలో అర్జీ ఇచ్చినా ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా ఆన్‌లైన్‌లో సమస్య పరిష్కారమైనట్లు చూపడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటన్నింటిపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నేతలు జయచంద్ర, కరిముల్లా, బాలాజీ తదితరులు అధికారులకు ఓ వినతిపత్రాన్ని అందించారు.

కలెక్టర్‌కు వినతుల వెల్లువ