
క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో వీసీలు
తిరుపతి సిటీ: విజయవాడ హోటల్ నోవోటెల్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ అప్పారావు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పాల్గొన్నారు. అమరావతిని భారతదేశ క్వాంటమ్ వ్యాలీగా – తదుపరి తరం క్వాంటమ్ టెక్నాలజీలకు కేంద్రంగా ఉంచాలనిన్న లక్ష్యంగా క్వాంటం కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్‌న్స్, గణితం, భౌతిక శాస్త్రం వంటి కీలక డొమైన్‌లపై సోమవారం జరిగిన వర్క్‌షాప్‌లో వీసీలు పాల్గొన్నారు. వీసీలు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌తో సహా ఎంపిక చేసిన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల లో క్వాంటం కంప్యూటింగ్‌ను మైనర్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపులో ఎస్వీయూ నుంచి ఆచార్య సుబ్బారావు, డాక్టర్ ఉషా రాణి, ఆచార్య జయ సుబ్బారెడ్డి, డాక్టర్ హేమలత, రుద్రమదేవి, ఆచార్య అంజన్ బాబు పాల్గొన్నారు.
మూడు టిప్పర్లు సీజ్
సత్యవేడు: మండల కేంద్రంలోని సమీపంలో మూడు టిప్పర్లను మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అధికారులు సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా చమర్తికండ్రిగలోని సెవన్ హిల్స్ క్వారీ నుంచి తమిళనాడుకు కంకరు తరలిస్తున్న మూడు టిప్పర్లకు బిల్లులు సక్రమంగా లేకపోవడంతో తిరుపతి మైన్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. అక్కడి నుంచి సత్యవేడు ఆర్టీసీ గ్యారేజ్‌కు తరలించారు.

క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో వీసీలు