
జాబ్‌మేళా పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ స్టూడెంట్స్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో జూలై 6న ఎంఆర్‌ఎఫ్ సంస్థ నిర్వహించనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను మంగళవారం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఆవిష్కరించారు. డిప్లొమో, ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళీధర్, డాక్టర్ పత్తిపాటి వివేక్, ఎంఆర్‌ఎఫ్ ప్రతినిధి వెంకటరామన్ పాల్గొన్నారు.
ఏపీపీజీఈసెట్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్–2025 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులో 13 పీజీ సబ్జెక్టుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీపీజీసెట్‌కు ఎస్వీయూ రీజియన్ నుంచి 3,946 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రవేశ పరీక్షకు 3,434మంది హాజరయ్యారు. వీరిలో 3,208 మంది ఉత్తీర్ణత సాధించారు. జీఈఓ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫోమ్యాటిక్స్ విభాగంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టి. సుధాకర్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన విజయ్‌వర్మ 5వ ర్యాంకు సాధించాడు.

జాబ్‌మేళా పోస్టర్ల ఆవిష్కరణ