ముత్యపు పందిరిపై తేజోమూర్తి
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం రాత్రి స్వామివారు ముత్యపు పందరి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఉదయం సింహవాహనంపై స్వామివారు ఊరేగారు. 10 నుంచి 11 గంటల వరకు దేవదేవేరులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి, ఏఈఓ కె.మునికృష్ణారెడ్డి, ఏవీఎస్‌ఓ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.


