బాబు పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం
కూటమి ప్రభుత్వం పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు విద్యను అమ్మేసేందుకు సిద్ధమైంది. 2024 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సుమారు లక్ష మంది విద్యార్థులకు రూ.235 కోట్ల మేర ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మొండిచెయ్యి చూపుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు మధ్యలోనే విద్యనాపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అమ్మఒడి, వసతి దీవెన, విదేశీ విద్య పథకాలకు మంగళం పాడేసింది. చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15వేలు నగదు అందిస్తామని చెప్పి ఇంతవరకు పైసా అందించకుండా వేధిస్తోంది. జిల్లాలోని 5.65 లక్షల మంది విద్యార్థులకు 2024 విద్యాసంవత్సరంలో రూ.847,50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం నాడు–నేడు పథకం ద్వారా నిర్మించ తలపెట్టిన సుమారు 47పాఠశాలల భవనాలను పూర్తి చేయకుండా మొండికేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా మార్చేసింది. పౌష్టికాహారానికి మంగళం పాడేసి నాసిరకం ఆహారాన్ని అందిస్తోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ను నిర్వీర్యయం చేసే ప్రయత్నం చేస్తూ, ఐబీ సిలబస్‌ను ఎత్తివేసే కుట్రకు తెరలేపింది.
బాబు పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం


