
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 933 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్‌లో కలిపి 11,196 మందికిగాను 840 మంది విద్యార్థులు గైర్హాజరవ్వడంతో 10,356 మంది పరీక్ష రాశారు. అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షకు 23 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్‌లో కలిపి 1,473 మందికిగాను 93మంది గైర్హాజరవ్వడంతో 1,380 మంది పరీక్షను రాశారు. సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా సోమవారం ఉదయం, మధ్యాహ్నం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బీపీసీ విద్యార్థులకు) పరీక్షను నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ జీవి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.