
శ్రీవారి మెట్టు మార్గంలో మెరుగైన సౌకర్యాలు
చంద్రగిరి: శ్రీవారి మెట్టు మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో అటోవాలాల దందా, టోకన్ల జారీలో జరుగుతున్న అవకతకవలపై ‘సాక్షి’ లో ఇటీవల వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై టీటీడీ స్పందించింది. టీటీడీ అదనపు వెంకయ్యచౌదరి, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి ఈఓ మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుంచి సరైన సహకారం లేనట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుంచి విచ్చలవిడిగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడాన్ని, టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, ఎస్‌ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి మెట్టు మార్గంలో మెరుగైన సౌకర్యాలు

శ్రీవారి మెట్టు మార్గంలో మెరుగైన సౌకర్యాలు