తిరుపతి కల్చరల్: దేహదారుఢ్యానికి ఫిజిక్ పోటీలు ఉపయోగపడుతాయని గోల్డెన్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏడవ పురుషులు, మహిళల బాడీ బిల్డింగ్‌తో పాటు మోడలింగ్ పోటీలు సోమవారం యూత్ హాస్టల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మెన్ ఫిజిక్, ఉమెన్ ఫిజిక్ విభాల్ని బాడీ బిల్డింగ్ అసోసియేషన్‌లో చేర్చడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలలో ఎస్.మణి, ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆదినారాయణ, నవీన్ రోహిత్, విగ్నేష్‌లు విజేతలుగా నిలిచారు. అలాగే మెన్ మోడలింగ్‌లో ఆదిత్య, ఉమెన్ మోడలింగ్‌లో నికిత, గాయత్రి, భావన, సిమ్రాన్ విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈశ్వర్ ప్రకాష్, శివప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ కె.రామచంద్ర, యోధ గ్రూప్ చైర్మన్ బీఎన్‌ఆర్.యోగేష్, ఒలింపిక్ స్టేషన్ మిస్ యూనివర్స్ ఉమెన్ ఫిజిక్ సాయక్‌హజ్ రూమ్(బాంబే), కార్యదర్శి ఆర్.శ్రీధర్, సభ్యులు పాల్గొన్నారు.
నిమ్మతోట ఆక్రమణకు యత్నం
కలువాయి(సైదాపురం): నిమ్మ తోట ఆక్రమణకు యత్నించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన ఘటన కలువాయి మండలం, చీపినాపి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు పసల కృష్ణయ్య, గ్రామస్తుల కథనం.. గ్రామ పరిధిలోని సర్వే నం.379లో 8.16 ఎకరాల భూమిలో కృష్ణయ్యకు 1.16 ఎకరాల వరకు ఉంది. ఇందులో గత 14 ఏళ్లుగా నిమ్మ చెట్లు సాగుచేసుకుంటున్నాడు. కూటమి నేతలు కొందరు నిమ్మచెట్లను ధ్వంసం చేసి పొలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దీనిపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. పొలం వైపు వెళ్తే క్రిమినల్ కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరిస్తున్నట్టు వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.
నిరసన తెలుపుతున్న బల్లవోలు గ్రామస్తులు