అనధికార హాకర్ల తరలింపు | - | Sakshi
Sakshi News home page

అనధికార హాకర్ల తరలింపు

Mar 24 2025 6:47 AM | Updated on Mar 24 2025 9:22 AM

అనధిక

అనధికార హాకర్ల తరలింపు

తిరుమల : తిరుమలలోని అనధికార హాకర్లను తిరుపతికి పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు తరలిస్తున్నారు. సాక్షి పత్రికలో ఈ నెల 21వ తేదీన శ్రీఇల వైకుంఠపురం.. ఇదేం అపచారంశ్రీ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి తిరుమలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 71 మంది అనధికార హాకర్లు, కూలీలు, ఇతర అనుమానితులను గుర్తించి తిరుపతికి పంపేశారు. ప్రతి ఒక్కరి గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిలో ఎవరైనా పాత నేరస్తులు ఉన్నారా అని తనిఖీ చేశారు. ఆదివారం ఈ మేరకు తిరుమలలోని పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లను తొలగించారు.

ఎమ్మెల్యేకు స్వాగతం..

విద్యార్థుల వాయిద్యం

చిల్లకూరు: మండలంలోని బల్లవోలులో కూటమి నేతలు ఏర్పాటు చేసిన చలివేంద్రం పార్రంభించేందుకు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ ఆదివారం గ్రామానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు స్థానిక పాఠశాల విద్యార్థులను నియమించారు. పిల్లలతో బ్యాండు వాయించేలా కూటమి నేతలు చర్యలు చేపట్టడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

రెండు లారీలు ఢీ

రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్‌): రేణిగుంట రమణ విలాస్‌ సర్కిల్‌లో ఆదివారం రెండు కంటైనర్‌ లారీలు ఢీకొన్నాయి. చైన్నె వైపు నుంచి కడప దిశగా వెళుతున్న హెవీ లారీలు ఒకదానికొకటి ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రేణిగుంట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు.

ఎర్రావారిపాళెం ఎస్‌ఐ బదిలీ

సాక్షి టాస్క్‌పోర్స్‌ : చంద్రగిరి నియోజక వర్గం ఎర్రావారిపాళెం ఎస్‌ఐ ఎర్రిస్వామి బదిలీపై కర్నూలుకు వెళ్లారు. కూటమి నేతల ఒత్తిడిని భరించలేకే ఆయన బదిలీ చేయించుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటుండడం గమనార్హం.

అనధికార హాకర్ల తరలింపు 1
1/3

అనధికార హాకర్ల తరలింపు

అనధికార హాకర్ల తరలింపు 2
2/3

అనధికార హాకర్ల తరలింపు

అనధికార హాకర్ల తరలింపు 3
3/3

అనధికార హాకర్ల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement