తిరుపతి సిటీ: గత 16ఏళ్లుగా కొలకలూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో కొలకలూరి సాహిత్య పురస్కారాలను పలు విభాగాలలో అత్యంత ఆదరణ పొందిన సాహిత్య రచయితలకు అందిస్తున్నామని కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య కొలకలూరి సుమకిరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి ఈ పురస్కారాలను అందించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ కథానికానికి కొలకలూరి భాగీరథి పురస్కారం, ఉత్తమ నవలకు కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం, ఉత్తమ విమర్శకులకు కొలకలూరి రామయ్య పురస్కారం, రూ.15వేల నగదు బహుమతిని అందించనున్నట్లు తెలిపారు. వచ్చేనెల 15లోపు ఆసక్తిగల రచయితలు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న ఉత్తమ నవలా రచయితలకు ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జరిగే పురస్కార సభలో బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. కథలు, నవలలు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, తెలుగు శాఖ అధ్యక్షుడు, పద్మావతీ మహిళా వర్సిటీ, తిరుపతి జిల్లా, 517502 అనే చిరునామాకు పంపించాలని కోరారు. విమర్శన రచనలను ఆచార్య కొలకలూరి సుమకిరణ్, ఆంగ్లశాఖ అధ్యక్షుడు, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి 517502 అను చిరునామాకు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 94419 23172, 99635 64664 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment