మరో మైలురాయిని అధిగమించిన శ్రీసిటీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీలోని క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ అగ్రగామి సంస్థ యూఎస్‌ఏ చార్ట్ ఇండస్ట్రీస్‌కు చెందిన వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అత్యాధునిక క్రయోజెనిక్ సాంకేతికతతో తయారైన భారీ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఈజిప్ట్‌లోని ప్రముఖ సంస్థ ఎయిర్ లిక్విడ్‌కు ఎగుమతి చేయడం ద్వారా మరో ప్రధాన మైలురాయిని అధిగమించింది. 531 కిలో లీటర్ల సామర్థ్యం, 168 టన్నుల బరువు, సుమారు 39 మీటర్ల పొడవు, 5.45 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ట్యాంక్ క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ భారీ నిర్మాణాన్ని చైన్నె పోర్ట్‌కు తరలించేందుకు ప్రత్యేక మల్టీ–యాక్సిల్ లాజిస్టిక్స్‌ను వినియోగించారు. ఈ ఎగుమతిని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గొప్ప విజయంగా అభివర్ణించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ప్రపంచ స్థాయి క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో వీఆర్వీ ప్రతిభను ఇది మరింత బలపరుస్తుందని అన్నారు.


