19 నుంచి అధ్యాపకులకు శిక్షణ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల విధానం ఈ ఏడాది నుంచి మారింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులకు, అధ్యాపకులకు పూర్తి స్థాయిలో ఇప్పటికే అవగాహన కల్పించారు. ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అన్ని కళాశాలల్లో ప్రతి సబ్జెక్టులో సిలబస్ పూర్తి చేశాం. రివిజన్ చేస్తున్నాం. నూతన పరీక్షల విధానంపై తుది విడతగా మరో మారు అధ్యాపకులకు ఈనెల 19వ తేదీన తిరుపతి చైతన్య కళాశాల వేదికగా శిక్షణ ఇవ్వనున్నాం. పరీక్షల విధానంపై ఎటువంటి తికమక లేదు.
–రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి


