తిరుపతిలో అభివృద్ధి పనులు సాఫీగా సాగకూడదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతులు కల్పించకూడదు.. ప్రజాప్రతినిధులకు మంచి పేరు రాకూడదు.. నగర విస్తరణకు అడుగులు పడకూడదు.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగకూడదు.. టీడీపీకి రాజకీయ లబ్ధి చేకూరితే చాలు అనే లక్ష్యంతో ఎల్లో మీడియా కుతంత్రాలకు తెరతీస్తోంది. నవ్విపోదరుగాక మాకేంటి అంటూ అసత్య కథనాలతో యథేచ్ఛగా ప్రభుత్వంపై బురదజల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరునగరి ఖ్యాతిని మసకబార్చేలా నిరాధార ఆరోపణలను గుప్పిస్తోంది. భావి తరాలు నష్టపోయినా మాకేంటి.. మా అనుకూల పార్టీకి లాభం చేకూరితే చాలు అన్నట్టు తప్పుడు ప్రచారానికి తెగబడుతోంది. అయితే వాస్తవాలు కనిపెట్టిన ప్రజానీకం మాత్రం పచ్చరాతలు.. పచ్చి అబద్ధాలే అంటూ తేల్చేస్తోంది.