
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు.
టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నేడు హనుమాన్ జయంతి
టిటిడిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, జీటీ ఆలయం ఎదురుగా, మఠం ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్ , అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్ వద్ద, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపం వద్ద. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.