
రాపూరు: మండలంలోని పెంచలకోనలో శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామివారు ఆదివారం బంగారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీవారి జన్మనక్షతమ్రైన స్వాతి నక్షత్రం కావడంతో మూల మూర్తిని చందనంతో అలంకరించడం ఆనవాయితీ. ఈ మేరకు స్వామివారికి ఉదయం అభిషేకం, చందన అలంకరణ చేపట్టారు. అనంతరం శాంతి హోమం, కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం శ్రీవారి అత్యంత ప్రియమైన వివిధ పుష్పాలు,ఆభరణాలతో శ్రీవారిని అలంకరించి గరుడుని కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.