
బీసీ సమ్మేళనంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం
శ్రీకాళహస్తి : జగనన్నతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం పట్టణంలోని రోటరీ క్లబ్‌లో రత్నం రెడ్డి ఆధ్వర్యంలో బీసీ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు 64శాతం రిజర్వేషన్లతో పదవులు కట్టబెట్టిందన్నారు. ఎన్‌టీ రామారావు తర్వాత రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం నిలబెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీలను బీసీలకు ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఆయన బాటలోనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పయనిస్తున్నారని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్‌రెడ్డినే మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వడ్లతాంగాళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, పురుషోత్తం గౌడ్, బుజ్జి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, మన్నేపల్లి శ్రీనివాసులు, గాంధీ, ఉమాసింగ్ , లక్ష్మీపతి రెడ్డి, తపాలా దామోదర్ రెడ్డి, బజాజ్ మురళి, కృష్ణారెడ్డి, కిట్టు మేస్త్రి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు