
రామచంద్రయ్యనాయుడుకు అంజలి ఘటిస్తున్న తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
పాకాల : మండలంలోని శంఖంపల్లె, కనుముందరపల్లె, గురురంగయ్యగారిపల్లెలో మృతి చెందిన ముగ్గురికి తుడా చైర్మన్, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శనివారం విద్యుదాఘాతంతో మరణించిన వలంటీర్ సుభాషిణి(35) స్వగ్రామం శంఖంపల్లికి మోహిత్‌రెడ్డి చేరుకుని ఆమె మృతదేహానికి అంజలి ఘటించారు. మృతురాలి భర్త మురళి, కుమార్తె యశశ్రీ, కుమారుడు డోలచంద్‌ను ఓదార్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రూ.20 వేలు నగదును మురళీకి అందజేశారు. అలాగే లింగనపల్లి పంచాయతీ కనుముందరపల్లెలో రామచంద్రయ్య నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఇరుగురంగయ్యగారిపల్లిలో నాగభూషణం భౌతికకాయానికి పూలమాల వేసి కుటుంబీకులకు సంతాపం తెలిపారు. కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నంగా నరేష్‌రెడ్డి, ఎంపీపీ లోకనాథం, జెడ్పీటీసీ సభ్యులు నంగా పద్మజారెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు కపిలేశ్వర్‌రెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, బాబురెడ్డి, శ్యామలా, లోకనాథరెడ్డి, బాబు పాల్గొన్నారు.
పరామర్శలు
సామిరెడ్డిపల్లి పంచాయతీ కనుముందరపల్లెలో విశ్రాంత ఉపాధ్యాయుడు రఘునాథరెడ్డి కర్మక్రియలకు మోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఇరంగారిపల్లె పంచాయతీ తలారిపల్లె పార్టీ యూత్ లీడర్ గుణశేఖర్ తండ్రి రాజేంద్ర కర్మక్రియలకు హాజరై కుటుంభ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం కె.వడ్డేపల్లెలో పార్టీ నాయకుడు ఈశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. వారి తల్లి జానకమ్మ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వలంటీర్ సుభాషిణి మృతదేహనికి నివాళులర్పిస్తున్న మోహిత్‌రెడ్డి