
గురుదక్షిణామూర్తి సన్నిధిలో జస్టిస్ రామకృష్ణ
సత్యవేడు: ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలకు శ్రీసిటీ ఫౌండేషన్ చేయూతనందించింది. శుక్రవారం నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రూ.25 లక్షల విలువచేసే 30 డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 25 పోడియంలను టీహెచ్‌కే కంపెనీ వితరణగా అందజేసింది. కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మకటో సాడో వాటిని లాంఛనంగా ప్రారంభించారు. తమ సీఎస్సార్ నిధులతో విద్యాసంస్థల బలోపేతానికి మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎం సుందరవల్లి అభినందనలు తెలిపారు. పరిశ్రమల సీఎస్సార్ నిధులతో విద్యాసంస్థలకు వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హంటర్ డగ్లస్ కంపెనీ సత్యవేడు ప్రభుత్వ జూనియర్‌కళాశాలకు ప్రింటర్లు, ఇరుగుళం, మాధనపాళెంకు స్మార్ట్ బోర్డులు, తడ, సూళ్లూరుపేట హైస్కూళ్లకు సుమారు రూ.6.5 లక్షల విలువైన స్మార్ట్ డిస్‌ప్లేబోర్డులు, ప్రింటర్లును వితరణగా అందజేసింది. హంటర్ డగ్లస్ ప్యాక్టరీ హెడ్ తమిలళగన్ స్మార్ట్ బోర్డులను ప్రారంభించారు.
శ్రీకాళహస్తీశ్వరుని సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శుక్రవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ.రామకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా.. అధికారులు స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 12వ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులునాయక్, శ్రీకాళహస్తి న్యాయమూర్తులు బేబీరాణి, కృష్ణప్రియ, సీఐ అంజుయాదవ్ పాల్గొన్నారు.

పాఠశాలలకు అందజేసిన డెస్క్‌టాప్ కంప్యూటర్లు