
ఎల్కతుర్తిలో ఘటన
మృతుడు రాజస్థాన్ వాసి
ఎల్కతుర్తి(హన్మకొండ): ఏడు నెల గర్భవతి అయిన తన భార్యను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే (సపర్యలు) బెంగతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని జై బాలాజీ స్టోన్స్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం..
రాజస్థాన్‌లోని గోగవస్ సికర్ జిల్లాకు చెందిన రాజేంద్రకుమార్ జాకర్ (21) రెండు నెలల క్రితం ఎల్కతుర్తి వచ్చి జై బాలాజీ స్టోన్స్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య 7నెలల గర్భవతి. ఈ సమయంలో తన దగ్గరుండి చూసుకోలేకపోతున్నానని కొన్ని రోజులుగా స్నేహితులతో చెప్పుకుని మదనపడేవాడు. ఈ విషయంపై మనస్తాపం చెందిన రాజేంద్రకుమార్ జాకర్ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధులవుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.