చిరుత దాడిలో రెండు మేకలు మృతి  | Two Goats Killed In Leopard Attack At Nirmal District | Sakshi
Sakshi News home page

చిరుత దాడిలో రెండు మేకలు మృతి 

Oct 15 2021 2:14 AM | Updated on Oct 15 2021 2:14 AM

Two Goats Killed In Leopard Attack At Nirmal District - Sakshi

మేకను తింటున్న చిరుతపులి 

పెంబి(ఖానాపూర్‌): నిర్మల్‌ జిల్లా తాండ్ర రేంజ్‌ పరిధిలోని పస్పుల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల మందపై చిరుత దాడిచేసి రెండు మేకలను హతమార్చింది. పెంబి మండలం హరిచంద్‌తండాకు చెందిన పశువుల కాపరి టేకం రాజేశ్‌ బుధవారం మేకల మందతో పస్పుల అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మందపై చిరుత దాడి చేసింది. రాజేశ్‌ కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ ఘటనపై అటవీ సిబ్బందికి సమాచారం అందించగా ఎఫ్‌ఎస్‌వో ప్రభాకర్, ఎఫ్‌బీవో నరేశ్, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి జీవాల కళేబరాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుత దాడిచేసిన ప్రాంతంలో అటవీ సిబ్బంది సీసీ కెమెరాలను బిగించారు. వాటిని గురువారం పరిశీలించగా, మేకల కళేబరాలను చిరుత ఎత్తుకెళ్లినట్లు నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement