B.ED With B Tech Telangana: బీటెక్, బీఈడీ ఉంటే టీచర్‌ పోస్టులకు అర్హులే

TS HC says Students Have BTech And BED They Are Eligible Teacher Posts - Sakshi

సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల మేరకు బీటెక్, బీఈడీ విద్యార్హత కలిగిన అభ్యర్థులూ పీజీటీ/టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు బీటెక్‌ అభ్యర్థులనూ ఈ పోస్టులకు అనుమతించాలంటూ 2019లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.

‘ఎన్‌సీటీఈ 2010, 2014 మార్గదర్శకాల ప్రకారం బీటెక్, బీఈడీ చదివిన అభ్యర్థులూ పీజీటీ, టీజీటీ పోస్టులకు అర్హులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీఈడీ చదివిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొంది. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల మేరకు బీటెక్‌ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి తీర్పు సరైనదే’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top