KCR Munugodu Meeting: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్‌ డ్యాన్స్‌తో ఇరగదీసిండు..

TRS Minister Malla Reddy Mass Dance In Car Video Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం ఎవరి నోట విన్నా మునుగోడు పాలిటిక్స్‌ గురించే చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్‌ పెట్టాయి. కాగా, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడులో గెలుపే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. ఇక, శనివారం మునుగోడులో ప్రజాదీవెన బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ కూడా హాజరు కానున్నారు. 

మరోవైపు.. మునుగోడు సభకు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రులు సైతం హుషారుగా సభకు విచ్చేస్తున్నారు. కాగా, మునుగోడుకు వస్తున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్‌ ఈరోజు హైలైట్‌ ఆఫ్‌ ది డేగా చెప్పుకోవచ్చు. తన కాన్వాయ్‌లో వస్తున్న మల్లారెడ్డి ఓపెన్‌ టాప్‌ కారులో నిల్చుని ఊరా మాస్‌ డ్యాన్స్‌ స్టెప్పులు వేశారు. 

ఇక, కారు దిగిన అనంతరం కూడా మల్లారెడ్డి మాస్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో ఇరగదీశారు. ఆయన డ్యాన్స్‌ చేయడంతో అక్కడున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో జోష్‌ పెరిగి మంత్రితో వారు కూడా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: మునుగోడు సభకు.. సీఎం కేసీఆర్‌ కారెక్కనున్న చాడ వెంకట్‌రెడ్డి!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top