తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీలు | Transfers of IFS Officers in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీలు

Apr 29 2026 9:36 PM | Updated on Apr 29 2026 9:37 PM

Transfers of IFS Officers in Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్. రమేష్‌కి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం హైదరాబాద్‌కి బదిలీ చేసింది. బి. ప్రవీణాను ములుగు ఫారెస్ట్ కాలేజ్ డీన్‌గా నియమించగా.. బాలమణికి కుమ్రంభీం ఆసిఫాబాద్ డీఎఫ్‌వోగా పోస్టింగ్ ఇచ్చారు.

బోగా నిఖిత.. వరంగల్ డీఎఫ్‌వోగా బదిలీ అయ్యారు. వికాస్ మీనా ములుగు డీఎఫ్‌వోగా నియమితులయ్యారు. శివ్ ఆశీష్ సింగ్ మహబూబ్‌నగర్‌కు బదిలీ కాగా, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌కు నిజామాబాద్ డీఎఫ్‌వోగా పోస్టింగ్ ఇచ్చారు. రాహుల్ కిషన్ జాదవ్ మంచిర్యాల డీఎఫ్‌వోగా నియామకం కాగా, నరిజ్ కుమార్ తిబ్రేవాల్ కామారెడ్డి డీఎఫ్‌వోగా బదిలీ అయ్యారు. అనుజ్ అగర్వాల్ ఖమ్మం డీఎఫ్‌వోగా పోస్టింగ్ ఇవ్వగా.. సత్యనారాయణ.. రాజన్న సిరిసిల్ల-కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. జి. జ్ఞానేశ్వర్‌ను హోఎఫ్‌ఎఫ్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement