72 గంట‌ల‌పాటు హైద‌రాబాద్‌లో అతిభారీ వ‌ర్షాలు

There Is A Possibility Of Heavy Rains In Hyderabad For Next 72 hrs - Sakshi

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులకు సూచ‌న‌
 

సాక్షి, హైద‌రాబాద్ : వాతావ‌ర‌ణ శాఖ జారీచేసిన అంచ‌నాల ప్ర‌కారం రాబోయే 72 గంట‌ల పాటు న‌గ‌రంలో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని  జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఓ  ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కొన్ని చోట్ల  9 నుండి 16 సెంటిమీట‌ర్ల అతిభారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఏర్ప‌డే వ‌ర‌ద‌ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ప‌రిధిలోని క్షేత్ర‌స్థాయి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను అప్ర‌మత్తంచేసి, అందుబాటులో ఉంచాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంట‌ర్లుగా గుర్తించిన పాఠ‌శాల‌లో, క‌మ్యునిటీహాల్స్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా అధికారులంద‌రూ అందుబాటులో ఉండాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. (రాష్ట్రంలో మళ్లీ వర్షాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top