
చేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవు
ఎస్‌ఐఆర్ పేరుతో ఈసీ తన పరిధి దాటింది
పౌరసత్వాన్ని రుజువు చేసుకునే బాధ్యతను పౌరులపై వేసింది.. గతంలో ఎన్నడూ ఈసీ అలా చేసిన సందర్భం లేదు
ప్రమాదంలో భూమి, చదువులేని పౌరుల ఓటు
అజయ్‌గాంధీ స్మారక ఉపన్యాసంలో .. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లను మ్యానిపులేట్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. అయితే, దేశంలో ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నట్లు తాను భావించటంలేదని తెలిపారు. ఏ దేశంలోనూ ఈవీఎంలను దుర్వినియోగం చేసినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈవీఎంలపై కోర్టుల్లో 40కిపైగా కేసులు వీగిపోయాయని గుర్తుచేశారు.
మంతన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని విద్యారణ్య పాఠశాలలో ‘కేంద్ర ఎన్నికల సంఘం: ముప్పేట దాడిలో ఓ కాపలాదారుడు’అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో అశోక్ లావాసా.. మంథన్ సహ వ్యవస్థాపకుడు ‘అజయ్ గాం«దీ’స్మారక ఉపన్యాసం ఇచ్చారు. సాంకేతిక రంగంలో శరవేగంగా మార్పులు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల ప్రక్రియపై నిరంతర నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎస్‌ఐఆర్ పేరుతో ఈసీ పరిధి అతిక్రమణ..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధిని దాటి వ్యవహరించిందని అశోక్ లావాసా అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం చరిత్రలోనే ఇది అత్యంత వివాదాస్పద అంశమని తెలిపారు. ఓటర్ల జాబితాలో స్థానం కోసం పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని పౌరులపై బాధ్యతలను వేయడం ఇదే తొలిసారి అన్నారు. గతంలో గుర్తింపు, పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇస్తే ఓటరుగా నమోదు చేసేవారని గుర్తుచేశారు.
దేశంలో పౌరసత్వం రుజువుకు ప్రభుత్వం ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వదని.. పాస్‌పోర్టు కూడా ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డుల తరహాలో పౌరసత్వ రుజువు కాదని తెలిపారు. కొత్తగా దేశ పౌరసత్వాన్ని స్వీకరించే వారికే అలాంటి పత్రాలు ఇస్తుందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత రోడ్లపై నివసించే నిరాశ్రయులకు సైతం ఓటు హక్కు కల్పించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం తొలి కమిషనర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
వారు ఓటు హక్కు కోల్పోతారు..
ఎస్‌ఐఆర్ నిర్వహణ వెనుక ఉద్దేశం, పాటించిన సూత్రాలు, అమలుపరిచిన విధానంపై ఎన్నో సందేహాలు లేవనెత్తాయని అశోక్ లావాసా అన్నారు. అర్హులందరికీ ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తామని, అనర్హులని తొలగిస్తామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియను చేపట్టడం, ముందస్తు ప్రకటన లేకుండా అకస్మాత్తుగా ఎస్‌ఐఆర్‌ను అమలు చేయటం వివాదాస్పదమైందని చెప్పారు.
చివరిసారిగా 2003లో ఎస్‌ఐఆర్‌ను 8 నెలల్లో నిర్వహించగా, ఈసారి 90 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో ఎన్నో ఇబ్బందులొచ్చాయని అన్నారు. దేశంలో పుట్టి ఎలాంటి భూమి లేని, బడికి వెళ్లని, ఎలాంటి ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందని వారు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ నిర్దేశించిన 11 డాక్యుమెంట్లలో ఏదీ పౌరసత్వాన్ని ధ్రువీకరించదని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అందరూ కలిసి పనిచేయాలని అశోక్ లావాసా పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలను సమాచార చట్టం పరి ధిలోకి తీసుకురావాలని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని, రాజకీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని అశోక్ లావాసా విమర్శించారు.