యాసంగిలోనూ వరిసాగే ఎక్కువ | There is more rice cultivation in Yasangi | Sakshi
Sakshi News home page

యాసంగిలోనూ వరిసాగే ఎక్కువ

Jan 10 2025 4:53 AM | Updated on Jan 10 2025 4:53 AM

There is more rice cultivation in Yasangi

సాధారణ సాగు విస్తీర్ణం 63 లక్షల ఎకరాలు 

ఈసారి 75 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా

ఇందులో వరి సాగయ్యేది 63 లక్షల ఎకరాల్లో ...

సాక్షి, హైదరాబాద్‌: ఈ యాసంగి సీజన్‌లోనూ  రైతు లు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. సీజన్‌ ప్రారంభమై నెలరోజులు కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25.61 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగ య్యాయి. ఇందులోనూ ఆయా జిల్లాల్లో 26 శాతం నుంచి 50 శాతం వరకు వరి సాగవడం గమనార్హం.

యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎక రాలు కాగా, పెరిగిన నీటివసతి, సన్నవడ్లకు రూ. 500 బోనస్‌తో 79 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో అత్యధికంగా 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని భావి స్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ ఏర్పా ట్లు చేసింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో పంటల సాగు పూర్తవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 

ఏడు జిల్లాల్లో 75 శాతం పూర్తి కావొచ్చిన పంటల సాగు
కూరగాయలు, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, కందులు, పొగాకు వంటి పంటలు వేసే జిల్లాల్లో..ఇప్పటి వరకు 51శాతం నుంచి 75శాతం వరకు పంటల సాగు పూర్తయింది. 
»  ఆదిలాబాద్, నిర్మల్, జనగాం, నిజామాబాద్, ఖమ్మం, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పంటలు వేగంగా సాగవుతున్నాయి. 
»   25 శాతం కన్నా తక్కువగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పంటలు సాగయ్యాయి. 
»   ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వరి సాగు ఆలస్యమవుతోంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణం తగ్గనుండగా, ఆరుతడి పంటలు ఎక్కువగా సాగవనున్నాయి.
»   మరో 12 జిల్లాల్లో 25 శాతం కన్నా అధికంగా 50 శాతం లోపు పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. 

3.65 లక్షల టన్నుల యూరియా వినియోగం..
ఈ యాసంగి సీజన్‌లో 19.60 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర వివిధ రకాల ఎరువులు అవసరమవుతాయని ప్ర భుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతి పాదనలు పంపగా, దశల వారీగా సరఫరా అయినట్టు మార్క్‌ఫెడ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3.65 లక్షల ట న్నుల యూరియా, 1.10 లక్షల టన్నుల డీఏపీ, 3.79 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 24వేల టన్నుల పొటాష్, 19వేల టన్నుల సూపర్‌ ఫాస్ఫేట్‌ను రైతులు కొనుగోలు చేశారు. 

3.61 లక్షల టన్నుల యూరియా, 24వేల టన్నుల డీఏపీ, 2.15 లక్షల టన్నుల కాంప్లెక్స్, 38వేల టన్నుల పొటాష్‌ , 17వేల టన్నుల సూపర్‌ ఫాస్ఫేట్‌ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నట్టు మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement