సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్29) ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. టెన్త్ ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్స్ కాకుండా మార్కులను కూడా ఫలితాల్లో వెల్లడించనున్నారు.
👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇక, తెలంగాణలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్ ద్వారా నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
👉 sakshieducation.com
👉 https://results.bsetelangana.org
👉 https://results.bse.telangana.gov.in
👉 https://bse.telangana.gov.in
👉 https://schooledu.telangana.gov.in
పదవ తరగతి పరీక్షా ఫలితాల వివరాలు
ఉత్తీర్ణత శాతం -95.15శాతం
బాలురు - 94.07శాతం
బాలికలు -96.26 శాతం
100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -5731
0 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -06
99.30 శాతంతో ములుగు జిల్లా ఫస్ట్.
89.23శాతంతో హైదరాబాద్ లాస్ట్
సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత -99.10శాతం
ప్రభుత్వ పాఠశాలల్లో 86.18శాతం
జిల్లా పరిషత్ పాఠశాల్లో 93.53శాతం
మోడల్ స్కూల్స్‌లో 97.83శాతం
కేజీబీవీల్లో 98శాతం
ప్రైవేట్ పాఠశాలాల్లో 95.81శాతంతో పాస్
2065 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100శాతం పాస్ పర్సెంటేజ్
మార్కుల రీ కౌంటింగ్ ,రీ వెరిఫికేషన్ ఈనెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు అధికారులు
పదవతరగతి సప్లిమెంటరీ ..
జూన్ 5 నుంచి 12 వరకు నిర్వాహాణ.ఈనెల 30 నుంచి మే 16 తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.


