KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా | Telangana Minister KTR Once Again Tested Corona Positive | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌.. ట్వీట్‌ ద్వారా వెల్లడి

Aug 30 2022 6:12 PM | Updated on Aug 30 2022 6:17 PM

Telangana Minister KTR Once Again Tested Corona Positive - Sakshi

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కరోనా బారిన పడ్డారు. టెస్టుల్లో పాజిటివ్‌ నిర్ధారణ.. 

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు కేటీఆర్‌. లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారాయన. స్వల్ప లక్షణాలతోనే ఆయన కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని ఆయన అభ్యర్థించారు.

ఇటీవలె కాలిగాయం నుంచి కోలుకున్న కేటీఆర్‌.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై ట్వీట్లతో విరుచుకుపడుతుండడం చూస్తున్నాం. గతంలోనూ కేటీఆర్‌  (2021, ఏప్రిల్ చివరివారంలో) క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

ఇదీ చదవండి: ట్రాక్టరే కాదు నాకు పొక్లెయినర్‌ నడపటం కూడా వచ్చు: రేణుకా చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement