Telangana: మరో 528 మందికి కరోనా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 528 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 805,665 మందికి కరోనా సోకగా, వీరిలో 796,365 మంది కోలుకున్నారు. మరో 5,189 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,111 మంది మరణించారు.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా 24,968 నిర్ధారణ పరీక్షలు చేయగా, 336 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.