Telangana: కోవిడ్‌ థర్డ్‌వేవ్‌.. అప్రమత్తమైన వైద్యశాఖ.. పిల్లల కోసం ప్రత్యేక పడకలు

Telangana Govt Prepares For 3rd Wave Of COVID 19  Increases All Facilitys In Govt Hospitals - Sakshi

కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్‌ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వైద్యం కోసం అప్పుసొప్పు చేసి చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండో దశ ముగియడంతో మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. పిల్లలపై కోవిడ్‌ వైరస్‌ ప్రభావం చూపితే వైద్యం అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్‌లో పిల్లల కోసం ప్రత్యేక పడకలు, ఆక్సిజన్‌ సిలెండర్లు, వెంటిలెటర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రత్యేక చర్యలు ముమ్మరం చేశారు.

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు రిమ్స్‌ వైద్య కళాశాల ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పిల్లలకు సంబంధించిన వైద్య నిపుణులు లేరు. పిల్లలకు వైద్యం అందించేందుకు రిమ్స్‌ ఆస్పత్రే పెద్ద దిక్కుగా ఉంది. కోవిడ్‌ మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. రెండో దశ ఇంకా ముగియకముందే మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు సూచించారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో మొత్తం 768 పడకలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం పెద్దల కోసం 416 ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా పది ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 175 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. పిల్లలపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో పిల్లల వార్డులో 60 ఆక్సిజన్‌ బెడ్లను రిమ్స్‌ అధికారులు సిద్ధం చేశారు. 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయగా, మరో పది బెడ్లను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అన్ని రోగాలకు సంబంధించి రిమ్స్‌లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతున్నారు. 

అప్రమత్తమైన వైద్య శాఖ
థర్డ్‌వేవ్‌లో చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ, రిమ్స్‌ అధికారులు ముందుచూపుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేయగా, మందులను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు రిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా బారిన పడి 4వేలకు పైగా చికిత్స పొందారు. 80కి పైగా మృత్యువాత పడ్డారు. మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 5శాతం మంది కూడా చిన్నారులు కోవిడ్‌ బారిన పడలేదని రిమ్స్‌ డైరెక్టర్‌ వివరించారు. దాదాపు 50 మంది వరకు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారని తెలిపారు. మరణాలు కూడా తక్కువగానే ఉంటాయని పేర్కొంటున్నారు.

తగ్గుముఖం పట్టిన కోవిడ్‌
కోవిడ్‌ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి నెలలో జిల్లాలో మొదటి కేసు నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కేసులు పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో మరోసారి విజృంభించి ఏప్రిల్‌ నెలలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత నెలలో లాక్‌డౌన్‌ విధించడంతో మళ్లీ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 5 నుంచి 10 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,70,648 పరీక్షలు చేయగా 16,252 మందికి పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యింది. 3,54,193 మందికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో 84 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 16,084 మంది కోవిడ్‌ను జయించారు. దాదాపు 200 మందికి పైగా కోవిడ్‌ బారిన పడి మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల లెక్కల ప్రకారం 84 మంది మృతిచెందారు.

భయపడాల్సిన అవసరం లేదు
థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. పెద్దవారికి సోకినంతగా వైరస్‌ చిన్నారులకు సోకదు. వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రులు చిన్నారులను అనవసరంగా బయటకు తీసుకెళ్లొద్దు. చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకునేలా చూడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల్లో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, కడుపునొప్పి తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

– బానోత్‌ బలరాం, రిమ్స్‌ డైరెక్టర్, ఆదిలాబాద్‌  

చదవండి: ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-06-2021
Jun 14, 2021, 03:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకాలు వేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గడచిన 6 రోజుల్లో 3,19,699...
13-06-2021
Jun 13, 2021, 19:58 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ ఉధృతి  కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280...
13-06-2021
Jun 13, 2021, 16:50 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,02,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో...
13-06-2021
Jun 13, 2021, 09:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా  80,834...
13-06-2021
Jun 13, 2021, 05:23 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి...
13-06-2021
Jun 13, 2021, 03:31 IST
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌...
13-06-2021
Jun 13, 2021, 02:59 IST
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం!  దీంతో పోలిస్తే... 1,400 అనే...
13-06-2021
Jun 13, 2021, 02:17 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌లో వైద్యపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది....
12-06-2021
Jun 12, 2021, 19:32 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా...
12-06-2021
Jun 12, 2021, 17:12 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన...
12-06-2021
Jun 12, 2021, 14:09 IST
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.....
12-06-2021
Jun 12, 2021, 12:36 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు...
12-06-2021
Jun 12, 2021, 11:57 IST
భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్‌(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల...
12-06-2021
Jun 12, 2021, 08:43 IST
మీర్‌పేట (హైదరాబాద్‌): టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్‌పేట రాఘవేంద్రనగర్‌ కాలనీలో చోటు...
12-06-2021
Jun 12, 2021, 08:30 IST
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ...
12-06-2021
Jun 12, 2021, 08:13 IST
పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్‌  సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం...
12-06-2021
Jun 12, 2021, 06:59 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారినపడిన కొందరిలో తీవ్రమైన లక్షణాలు కన్పిస్తున్నాయి ఎందుకు? ఈ ప్రశ్నకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానం...
12-06-2021
Jun 12, 2021, 05:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌...
12-06-2021
Jun 12, 2021, 05:17 IST
ఆపద కాలం ఉంటుంది. కానీ ఆదుకోలేని కాలం ఒకటి ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాం. ఒక కోడలు.. అపస్మారక స్థితిలో ఉన్న...
12-06-2021
Jun 12, 2021, 04:43 IST
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top