
సదర్ సరదాలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్
సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు ఇస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో అట్టహాసంగా సదర్ వేడుకలు
కవాడిగూడ: యాదవులకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పిస్తామని...హైదరాబాద్ కా సదర్ ..యాదవుల ఖదర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కులీకుతుబ్‌షాల కాలం నుంచి యాదవులపై నమ్మకం, విశ్వాసం ఉందని, యాదవులకు నమ్మిన వారికోసం ఏదైనా చేసే తెగువ ఉందని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ముందుగా, శ్రీకృష్ణ భగవానుడికి, దున్నపో తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లా డుతూ యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను యాదవ ప్రతినిధులు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యాదవుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాదవులకు సముచిత స్థా నం లభించిందన్నారు.
సదర్ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుడోలు.. కోలాటం.. బోనాలు, కళారూపాలు ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా జంటనగరాల నుంచి యాదవులు వారి దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో చేయి ంచిన విన్యాసాలు అలరించాయి. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లా డుతుండగా పాత పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.