పన్ను రాబడులే‘పునాదిగా’ | Tax Revenue Constitutes Over 56 Percentage of the Total Budget: telangana | Sakshi
Sakshi News home page

పన్ను రాబడులే‘పునాదిగా’

Mar 21 2026 6:12 AM | Updated on Mar 21 2026 6:12 AM

Tax Revenue Constitutes Over 56 Percentage of the Total Budget: telangana

మొత్తం బడ్జెట్‌లో 56 శాతానికి పైగా పన్నుల రూపంలోనే ఆదాయం 

రూ.3.24 కోట్ల బడ్జెట్‌లో రూ.1.81 కోట్లు పన్నుల ద్వారా రాబడి

ఇందులో సొంత పన్నుల ఆదాయం రూ.1.48 లక్షల కోట్లు... కేంద్ర పన్నుల్లో వాటా రూ.33 వేల కోట్లు

2025–26లో ఏకంగా రూ.25 వేల కోట్లు పెరిగిన సొంత పన్ను ఆదాయం

2024–25లో వచి్చంది రూ.1.09 లక్షల కోట్లు... 2025–26లో రూ.1.34 లక్షల కోట్లు 

పన్నేతర ఆదాయం రూ.35 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే పునాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడులు 3,24,134 కోట్లు ప్రతిపాదించగా, అందులో రాష్ట్ర సొంత పన్ను రాబడులు రూ.1,48,165.75 వస్తాయని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద వస్తుందని అంచనా వేసిన రూ.33,181.64 కోట్లు కలిపితే అది రూ.1,81,347.39 కోట్లకు చేరనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రాబడుల్లో పన్ను ఆదాయం రూపంలోనే 56 శాతం నిధులు సమకూరుతున్నాయన్న మాట. ఈ రాబడులను శాఖల వారీగా పరిశీలిస్తే ఈసారి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.52,310 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 38,105 కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ. 8,814 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, 2025–26లో పన్ను రాబడులను పరిశీలిస్తే రూ.1,63,490 కోట్లు సమకూరింది.

ఇందులో సొంత పన్నుల ఆదాయం రూ.1.34 కోట్లు కాగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,471 కోట్లు సమకేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్ను రాబడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర పన్నుల్లో వాటాను మినహాయించి 2024–25లో వచ్చింది రూ.1.09 లక్షల కోట్లు కాగా, 2025–26లో రూ.1.34 లక్షల కోట్లు వచ్చాయి. అంటే రూ.25వేల కోట్ల మేర పన్ను రాబడులు పెరిగాయన్న మాట. ఈ నేపథ్యంలోనే రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ మేరకు పన్ను ఆదాయంలో వృద్ధి ఉంటుందనిఅంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర పన్నుల్లో వాటాను కలిపి 1.81 లక్షల కోట్లు పన్ను ఆదాయాన్ని ప్రతిపాదించింది.  

పన్నేతర ఆదాయం తగ్గినా
బడ్జెట్‌ గణాంకాలను పరిశీలిస్తే గత రెండేళ్లుగా ఆశించిన మేరకు పన్నేతర ఆదాయం రావడం లేదు. 2024–25లో రూ.35 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ. 25,807 కోట్లు వచి్చంది. అంటే బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవ రాబడికి రూ.10వేల కోట్లు తేడా ఉంది. ఇక, 2025–26లో రూ.31,611.47 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ఆశించినా రూ.29,318 కోట్లు మాత్రమే సమకూరింది. అయినా పన్నేతర ఆదాయంపై ఆశలతో 2026–27 బడ్జెట్‌లోనూ రూ. 35,730.20 కోట్లను పన్నేతర ఆదాయం పద్దు కింద ప్రతిపాదించారు. గత ఏడాది ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్ల మేర పన్నేతర ఆదాయం పెంచడం గమనార్హం.

సగానికి సగం తక్కువ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు సగానికి సగం తగ్గాయని 2025–26 సవరించిన అంచనాలు చెబుతున్నాయి. 2024–25లో రూ.21,636.15 కోట్లు ఈ పద్దు కింద వస్తుందని అంచనా వేయగా, అందులో రూ.19,836 కోట్లు వచి్చనట్టు చూపెట్టారు. కానీ, 2025–26లో రూ. 22,782.50 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దును చూపెట్టగా, అందులో కేవలం రూ.11,161.49 కోట్లు మాత్రమే వచి్చంది. అయినా ఈసారి కేంద్రంపై భారీ ఆశలతో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దును పెంచి రూ.24,166 కోట్లుగా చూపెట్టడం గమనార్హం.  

మద్యం,రిజిస్ట్రేషన్ల ఆదాయంపైనే ఆశ  మద్యం, రిజిస్ట్రేషన్లు.. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నట్టు బడ్జెట్‌ ప్రతిపాదనలు చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి 2025–26లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.19,087 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ, ప్రతిపాదిత బడ్జెట్‌ కంటే దాదాపు రూ.3 వేల కోట్లు తక్కువగా రూ.16,087 కోట్ల ఆదాయం వచ్చింది. అయినా 2026–27 బడ్జెట్‌లో ఈ శాఖ ద్వారా రూ.19,540 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించడం గమనార్హం. దీనిని బట్టి ఈసారి భూముల విలువల సవరణ తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  

2024–25లో ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరగా, ఏ4 (వైన్‌) షాపులకు టెండర్లు íపిలవడం ద్వారా రూ.2వేల కోట్లు ఎక్కువగా వస్తుందన్న అంచనాల మేరకు రూ.27 వేల కోట్లు ప్రతిపాదించారు. అయితే, వైన్‌షాపుల టెండర్ల ద్వారా సమకూరిన మొత్తంతో కలిపి కూడా ఎక్సైజ్‌ ఆదాయం రూ.23,623 కోట్లు మాత్రమే వచి్చంది. అంటే దాదాపు రూ.4 వేల కోట్లు తగ్గింది. ఈ బడ్జెట్‌లో కూడా ఎక్సైజ్‌ ఆదాయాన్ని రూ.27,668 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement