ఖమ్మం సభ ఎఫెక్ట్.. కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్ సభలో పలువురు సీఎంలు, నేతలు గవర్నర్లు, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కాగా, గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ వ్యవస్థను అవమానించారు. సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడను. గవర్నర్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు. ప్రభుత్వం ఎందుకు ప్రొటోకాల్ పాటించడం లేదో సమాధానం చెప్పాలి. ప్రొటోకాల్‌పై కేసీఆర్ స్పందించాకే ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతాను. రిపబ్లిక్ డే అంశంపై నాకు సమాచారం లేదు. నేను ఎక్కడా నా లిమిట్స్ క్రాస్ చేయలేదు.
నేను 25 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాను. ప్రొటోకాల్ ఏంటో నాకు తెలుసు. గవర్నర్ వ్యవస్థను కించపరచడం మంచిది కాదు. నా డ్యూటీ నేను చేస్తున్నా.. నా దగ్గర ఎలాంటి సమస్య లేదు. గవర్నర్ కూర్చీకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. నేను ఇండిపెండెంట్‌గా పని చేస్తున్నా.. నాపై ఎవరి ఒత్తిడి లేదు. అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు