నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు  | Sakshi
Sakshi News home page

నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు 

Published Wed, Apr 24 2024 5:02 AM

Summer holidays for schools from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్‌ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మంగళవారమే చివరి పనిదినంగా ఉంది. ఈ సందర్భంగా మంగళవారం ఇటీవల ముగిసిన సమ్మెటివ్‌ అసెస్మెంట్‌–2 పరీక్షల ఫలితాలను స్కూళ్లలో ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement