శంషాబాద్‌లో 30 విమాన సర్వీసులు రద్దు | Restrictions, Covid-19 Force Cancellation Of 30 Hyderabad Flights | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో 30 విమాన సర్వీసులు రద్దు

May 8 2021 1:44 AM | Updated on May 8 2021 1:44 AM

Restrictions, Covid-19 Force Cancellation Of 30 Hyderabad Flights - Sakshi

సాక్షి, శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నం దున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఇతర రాష్ట్రాలు షరతులు విధిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను వాయిదా వేసుకుంటున్నారు. నైట్‌ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణాలతో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, çపుణే, చెన్నై తదితర నగరాలకు వెళ్లే సుమారు 30 విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.  

చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు)

Advertisement
 
Advertisement
Advertisement