
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికార హోదాలో మొదటిసారి హైదరాబాద్‌కు రాబోతున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె ఈనెల 24న హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 28న హైదరాబాద్‌కు వస్తారని ముందుగా ప్రచారం జరిగినా.. ఈ విషయంలో రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి షెడ్యూల్ అందలేదు.
అయితే తాజా గా అందిన సమాచారం ప్రకారం తన పర్యటనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముందుకు జరిపారని (ప్రీపోన్) రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలందినట్లు తెలిసింది. రాష్ట్రపతి రాక సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మరమ్మతులు, శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తీసుకోవాల్సిన ప్రొటోకాల్‌తో పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.